నిర్ణీత వ్యవస్థలో సమాజం ముందడుగు వేస్తూ వెళ్తుంది. దానితో పాటు నేను నడవలేకపోయాను.బంధాలను స్వేచ్ఛగా భావించి జీవితం శాశ్వతం అనుకునే మనుషుల మధ్య నా కోసం నేను వెతుకుతున్నాను. స్వార్థం నిండిన ఈ ప్రపంచంలో మనిషి తన వినాశనాన్ని తానే సృష్టించుకుంటున్నాడు. ప్రకృతి ప్రకోపానికి గురవుతూనే ఉన్నాడు. అలా నిర్ణీత సమాజంలో నటిస్తున్న నాకు నా స్వతంత్ర ఆలోచనలు ఉన్నాయి.. నాకు నచ్చినట్లు ఉండాలనుకుంటాను. ఏదైనా అనిపిస్తేనే చేస్తాను. కొందరికి నచ్చుతాను.. కొందరికి నచ్చను.